బాలీవుడ్ మోస్ట్ బెస్టకపుల్ షాహిద్‌కపూర్- మీరారాజ్‌పుత్, తన భర్త షాహిద్ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షాహిద్ ఇష్క్‌విష్క్ సినిమా సమయంలో తనకు 7ఏళ్లని ఆ టైంలో షాహిద్‌కపూర్‌ను చాక్లెట్ బాయ్‌గా పిలిచేవారని, తన స్నేహితురాలికి తన భర్త మీద క్రష్ ఉండేదని చెప్పుకోచ్చింది. ఇక, మా ఇద్దరి పెళ్లి జరగబోతుందని చెప్పినప్పుడు తన స్నేహితురాలు షాక్ గురైనట్టు తెలిపింది. ఈ మధ్యనే ముగ్గురం కలిసి ఈ విషయాలు తలుచుకునినవ్వుకున్నామని మీరా చెప్పుకొచ్చింది.
కాగా మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి దానిపై స్పందిస్తూ ఉంటుంది. తనభర్త షాహిద్‌కపూర్‌కు సంబం ధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా మీరారాజ్‌పుత్ పంచు కుంటుంది. తాజాగా ఈ విషయాన్ని సైతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడుకి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది.