బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్…
టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా రూ. 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి. సికిందర్…
బాలీవుడ్లో జాన్వీ కపూర్ మెరుపులు చూపించలేకపోతుంది. ఫస్ట్ ఎంటప్ట్లో భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది జాన్వీ కపూర్. ఇషాన్- జానూ జంటగా నటించిన దడక్ వంద కోట్లను వసూలు చేసింది. కానీ తర్వాత ఆ మార్క్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది దడక్ రేంజ్ హిట్ మళ్ళి రాలేదు. సగం సినిమాలు ఓటీటీకే పరిమితం కావడం కూడా ఆమెకు మైనస్‌గా మారాయి. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏడేళ్లు దాటి పోయింది. బ్లాక్ బస్టర్…
భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తోంది సాయి పల్లవి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని కథ, ఆ కథలో తనకుండే ప్రాధాన్యతకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తోంది ఈ ఫిదా గర్ల్. నంబర్ గేమ్‌ను అసలు పట్టించుకోని ఈ బ్యూటీ సౌత్‌లో యునిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అమరన్, తండేల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపించిన సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది.…
బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని సివిల్ లైన్స్‌లోని ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల గురువారం అర్థరాత్రి పలు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దిశా సోదరి ఖుష్బూ పటాని…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం (వాషింగ్టన్ డీసీ)లో బెస్ట్ మూవీగా ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్ ప్రదర్శించబడింది. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమా ఏక్ థా టైగర్. థియేటర్లలో విడుదలైన పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ గౌరవాన్ని ఈ సినిమా దక్కించుకుంది. ఇది భారతీయ సినిమాకు గర్వకారణం అని చెప్పొచ్చు. అరుదైన గౌరవంతో జేమ్స్…
పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్‌పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే…
సౌత్ సినిమాలను టైగర్ ష్రాఫ్ యూజ్ చేసుకున్నట్లుగా మరో యంగ్ హీరో చేసుకోలేదనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండే సౌత్ మూవీస్‌పై ప్రేమ పెంచుకున్నాడు టైగర్. పరుగు రీమేక్ ‘హీరో పంటి’ నుండే అతడి ప్రయాణం స్టార్టైంది. ఈ సినిమా సక్సెస్ కొట్టడం టైగర్ ష్రాఫ్ పేరు గట్టిగానే వినిపించడంతో నెక్ట్స్ కూడా ప్రభాస్, గోపీచంద్ మూవీ వర్షం రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాఘీతో మొదలైన ఈ సక్సెస్ పరంపర బాఘీ3 వరకు కంటిన్యూ…
తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల…
విక్కీతో సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే టాక్ బాలీవుడ్లో క్రియేట్ అయ్యింది. యురి నుండి రీసెంట్లీ వచ్చిన ఛావా వరకు వరుస విజయాలతో జోరు చూపిస్తున్నాడు. వేటికవే డిఫరెంట్ స్టోరీలు, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు. ఇక చత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన చావా తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏడాదిలో ఇప్పటి వరకు చావా కలెక్షన్లను రీచైన మూవీ రాలేదు. కూలీ, వార్2 బ్రేక్ చేస్తాయనుకుంటే.. వాటికవే బ్రేకులేసుకున్నాయి. Also…