బాలీవుడ్ బాక్సాఫీసును లాస్ట్ ఇయర్ పుష్ప2 రూల్ చేస్తే.. ఈ ఏడాది కాంతార చాప్టర్ వన్ ఊచకోత కోసింది. రూ. 125 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 820 ప్లస్ క్రోర్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియా హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా అవతరించింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా హిందీ మూవీ ఛావా పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టింది ఈ ఫోల్క్ యాక్షనర్. అంతేకాదు… ఈ ఏడాది కర్ణాటకలో రూ. 200 క్రోర్ మార్క్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. కేజీఎఫ్2 తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సెకండ్ కన్నడ ఫిల్మ్‌గా అవతరించింది. రిషబ్ శెట్టి దర్శకుడిగా, అటు నటుడిగా డబుల్ రోల్ పోషించిన ఈ ఫిల్మ్ అతడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లయ్యింది.
Also Read : Kollywood : రోజుకో రూమర్.. అయినా సరే ఆ దర్శకుడిపైనే కోలీవుడ్ హోప్స్
ట్రైలర్ నుండే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన కాంతార చాప్టర్ వన్.. నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. కేవలం హిందీలోనే రూ. 205 కోట్ల మార్క్ కలెక్షన్స్ క్రాస్ చేసిన కాంతార ప్రీక్వెల్.. బాలీవుడ్ లెక్కల ప్రకారం నార్త్‌లో రూ. 200 కోట్లను కొల్లగొట్టిన థర్డ్ కన్నడ ఫిల్మ్‌గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్2 రూ. 430 కోట్లతో ఫస్ట్ ప్లేసును ఆక్యుపై చేస్తే.. మహావతార్ నరసింహా సెకండ్ ప్లేసులోకి చొచ్చుకుని వచ్చింది. కాంతార చాప్టర్ వన్ కన్నా ఓ 40 డేస్ ముందు రిలీజైన మహావతార్ నరసింహా టోటల్ కలెక్షన్స్ నియర్లీ 325 కోట్లు కాగా, అందులో రూ. 240 కోట్లు హిందీ బెల్ట్ నుండి వచ్చినవే. ఆగస్టు14న రిలీజైన వార్2 కూడా ఈ కలెక్షన్స్ క్రాస్ చేయలేకపోవడం గమనార్హం. ఇలా బ్యాక్ టు బ్యాక్ శాండిల్ వుడ్ చిత్రాలు హిందీ బాక్సాఫీసు వసూళ్లను దుల్లగొట్టేశాయి. కానీ రిషబ్ శెట్టి ఫిల్మ్ ఓవర్సీస్‌లో మాత్రం లాస్ అయ్యిందని టాక్. ఇక అక్టోబర్ 31న ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతార వన్.. మహావతార్ నరసింహా హిందీ గణాంకాలను క్రాస్ చేస్తుందో లేదో లెట్స్ వెయిట్