Bollywood : 68 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో యాక్షన్‌కి సింబల్ అంటే సన్నీ డియోల్.. గతేడాది గదర్ 2 తో రికార్డులు తిరగరాశాడు… ఆ తర్వాత జాట్ తో పర్వాలేదనిపించుకున్నాడు .. ఇప్పుడు 68 వ ఏట కూడా అదే జోష్, అదే పవర్ చూపిస్తున్నాడు. దేశభక్తి అంటే సన్నీ డియోల్.. “బార్డర్ 2”తో మళ్లీ ఆ స్పిరిట్‌ను రీక్రియేట్ చేయబోతున్నాడు. 1997లో బార్డర్ సినిమా ప్రేక్షకుల్లో దేశ భక్తిని మేల్కొలిపింది. ఇప్పుడు “బార్డర్ 2”లో మరోసారి సైనికుడి ఆత్మ గర్జించబోతోంది. “జైహింద్!” అంటూ సన్నీ డైలాగ్ మళ్లీ దేశమంతా మార్మోగబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. మరొక వైపు రామాయణ 1లో మాత్రం సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు.
Also Read ; Dhruv : నాకు తెలుగులో నటించాలని ఉంది..
Also Read
ఈ ప్రాజెక్ట్ మొదటి భాగంలో అతని పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, రెండవ భాగంలో అతని పాత్ర గణనీయంగా విస్తరించబడుతుందని సమాచారం. మైథాలజీ, యాక్షన్, విజువల్ గ్రాండర్, ఈ మూడింటిని మిక్స్ చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా భారతీయ ఇతిహాసం రామాయణానికి కొత్త డైమెన్షన్ ఇవ్వబోతోంది. సన్నీ డియోల్ లాంటి పవర్ యాక్టర్‌కు ఈ రోల్ పర్ఫెక్ట్ ఫిట్ అని ఇండస్ట్రీ టాక్. “లాహోర్ 1947” — భారత విభజన నేపథ్యంలో జరిగే హృదయానికి హత్తుకునే భావోద్వేగ కథ. ధర్మేంద్ర ప్రొడక్షన్, రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్‌లో రూపొందుతోంది ఈ సినిమా. భారత, పాకిస్థాన్ విభజనలో చీలిన మనుషుల మనసుల బాధను చూపించే ఈ కథలో సన్నీ డియోల్ ఎమోషన్, ఇన్‌టెన్సిటీ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని బి టౌన్ లో వినిపిస్తున్న టాక్. బార్డర్ నుంచి లాహోర్ వరకు, రామాయణ నుంచి గబ్రు వరకు సన్నీ డియోల్ చూపిస్తున్నది కేవలం యాక్షన్ కాదు… శక్తి, ఆత్మవిశ్వాసం, దేశభక్తి.. మరొక్క సారి అతని మాటల్లో చెప్పాలంటే “శక్తి అంటే నువ్వు చూపించేది కాదు, నువ్వు చేసేది!”
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!