బాలీవుడ్ అంతే ఎప్పుడు ఏ జోనర్‌లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీటౌన్‌కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావుడి చేసింది. కాంట్రవర్సీయల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రస్ట్ చూపుతోంది. కానీ సడెన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యా నంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు అవేంటంటే..
Also Read : OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన దీపావళి సినిమాలు.. ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవబోతున్నాయంటే
సికిందర్ ప్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సెలక్టివ్‌గా తీసుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వన్. గాల్వన్ లోయలో చైనా సైనికునితో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా. చిత్రాంగద సింగ్ హీరోయిన్. నెక్ట్స్ ఇయర్ జూన్ లో మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 1962 ఇండో- చైనా యుద్దం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ ఫిల్మ్ 120 బహుదూర్. ఈ రెజంగ్‌లా వార్‌లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ సైన్యం.. 3 వేల మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తోంది బాలీవుడ్. భారత్ తరుఫున నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది 120 బహుదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్దం ముగిసింది.
Also Read : Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప
అమితాబ్ మనవడు అగస్త్యా నంద సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఎంట్రీలో లవ్ స్టోరీతో కాకుండా వార్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇక్కీస్‌తో వస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్దం బాటిల్ ఆఫ్ బసంత్ పూర్‌లో వీరోచిత పోరాటం చేసి 21 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆపీసర్ అరుణ్ కేతర్ పాల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1971 ఇండో- పాక్ వార్ ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్ బోర్డర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీడియోల్‌తో పాటు వరుణ్ ధావన్, అహన్ శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ జనవరి 23న రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీ సిరీస్. అలాగే అమీర్ ఖాన్ లాహోర్ 1947 కూడా ఇదే బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. వార్ జోన్ స్టోరీలంటే రియల్ స్టోరీలే కాదు ఫిక్షనల్ స్టోరీలు కూడా ఉన్నాయి. అలా ఫ్యూర్ ఫిక్షనల్ స్టోరీనే సిద్దం చేయబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. వార్ డ్రామాతో పాటు లవ్ స్టోరీకి వెయిటేజ్ కల్పించబోతున్నాడట. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆలియా ఫీమేల్ లీడ్. ఇలా వరుసగా సీనియర్స్ టూ జూనియర్స్ వార్ డ్రామాలకు సై అంటున్నారు. మరీ ఈ జాబితాలో ఇంకెంత మంది చేరతారో.