Bollywood : సల్మాన్ ఖాన్ పై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగుదాస్ మొదలు పెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే కారణమని, సెట్‌కి ఆలస్యంగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీని వల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మదరాసి హీరో ఉదయం ఆరుగంటలకే వచ్చేసేవాడు అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ సెటైర్ వేసే సరికి ఇష్యూ క్లోజ్ అయ్యింది అనుకున్నారు కానీ మళ్లీ చెలరేగింది. దానికి కారణమయ్యాడు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ.
Also Read : Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఓజీతో విలన్‌గా టాలీవుడ్ తెరంగేట్రం చేసి ఇమ్రాన్ హష్మీ హిందీలో హక్ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. షా బానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ నవంబర్ 7న థియేటర్లలో రాబోతోంది. యామి గౌతమ్ ఫీమేల్ లీడ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇమ్రాన్ హష్మీ తనలా చెప్పిన టైంకి షూట్‌కి వచ్చే అతికొద్దీ నటీమణుల్లో యామి గౌతమ్ అంటూ ఆమెను ప్రశంసించాడు. అక్కడితో ఊరుకున్నాడా, ఇప్పటికీ చాలా మంది యాక్టర్స్ చెప్పిన టైంకి సెట్‌కి రారు అనడంతో సల్లూ టార్గెట్ అయ్యేలా చేసింది. హీరో ఇమ్రాన్ హష్మీ అన్నది ముమ్మాటికీ సల్మాన్ ఖాన్‌నే అంటున్నారు సోషల్ మీడియా సైనికులు. ఎందుకంటే టైగర్3లో కండల వీరుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇమ్రాన్. సో అప్పుడు కూడా సల్లూభాయ్ ఇలాగే చేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. మురుగుదాస్, ఇమ్రానే కాదు ఫ్రెండ్ అమీర్ ఖాన్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో “అందాజ్ అప్నా అప్నా” టైంలో సల్మాన్ షూట్‌కి లేటుగా వచ్చాడని మెల్లిగా అంటించాడు.మొత్తానికి బాలీవుడ్‌లో, సల్మాన్ లేట్ అటెండెన్స్ నెవ్వర్ ఎండింగ్ టాపిక్ అవుతున్నట్లే కనిపిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..