విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వెంకీకి లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ హిట్ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా బాలివుడ్ లో రీమేక్ కాబోతుంది.
Also Read : Salman Khan : ఆ ఇద్దరి స్టార్ డైరెక్టర్స్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ కథని కాస్త అక్షయ్ స్టయిల్ లో మార్చే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే దానిపై పలు పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ చేసాడు దిల్ రాజు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనీస్ బాజ్మీనికి సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ దర్శకత్వ భాద్యతలు అప్పగించనున్నారు. రెడీ, భూల్ భూలయ్య2, 3, సింగ్ ఈజ్ కింగ్, వెల్కమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసాడు. రీమేక్ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడు అనే పేరున్న అనీస్ బాజ్మీ అయితేనే పర్ఫెక్ట్ అని భావించి దర్శకత్వం చేసే పని అప్పగించాడు అక్షయ్ కుమార్. దిల్ రాజుతో పాటు మరొక బాలీవుడ్ సంస్థ ఈ రీమేక్ నిర్మాణంలో భాగస్వామ్యంగా కలవబోతున్నట్టు సమాచారం. గత కొద్దీ కాలంగా సరైన హిట్ లేని అక్షయ్ కుమార్ కు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.