అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటులుగా ఇంతకు ముందు కూడా కలసి పని చేశారు. కానీ, ఇప్పుడు అజయ్ డైరెక్టర్ గా బిగ్ బీతో సినిమా చేస్తున్నాడు. అదే ‘మేడే’. సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇందులో ఉండటం విశేషం!“అమితాబ్ ని డైరెక్ట్ చేయటం, ఏ దర్శకుడికైనా గొప్ప కల. అదృష్టవశాత్తూ నేను ఆ స్వప్నం సాకారం చేసుకోగలిగాను!” అన్నాడు అజయ్ దేవగణ్. అంతే కాదు బచ్చన్ సాబ్ సెట్ మీద ఉంటే పనులన్నీ చకచకా…
సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు రూపొందిస్తున్న కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుకు సంబంధించిన పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ శిల్పా శెట్టిని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. వ్యక్తిగతంగాను శిల్పా కెరీర్ పై ఈ ప్రభావం గట్టిగానే పడింది. ఇదిలావుంటే, తాజాగా శిల్పా ఓ ఈవెంట్ లో ఫిట్…
బాలకృష్ణ తో రెండు సార్లు జోడీ కట్టింది రాధికా ఆప్టే. ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లో ఈ మరాఠీ లేడీ నందమూరి అందగాడితో రొమాన్స్ చేసింది. అయితే, మన బోల్డ్ బ్యూటీ టాలీవుడ్ లో ఒక లాగా బాలీవుడ్ లో మరోలాగా ఉంటుంది. హిందీ తెరపై ఉదారంగా అందాలు ప్రదర్శిస్తుంది. ఇక ఇంగ్లీషు సినిమాలు, ఓటీటీ కంటెంట్ లో అయితే నగ్నంగా కూడా నటిస్తుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత సహజంగానైనా నటించేందుకు గార్జియస్ బ్యూటీ రెడీ… నిన్న…
విద్యా బాలన్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘జల్సా’ పేరుతో ఆమె నెక్ట్స్ మూవీ చేయనుంది. గతంలో ‘తుమ్హారీ సులు’ లాంటి హిట్ అందించిన డైరెక్టర్ సురేశ్ త్రివేణీ రెండోసారి విద్యాతో కలసి పని చేయబోతున్నాడు.తెలుగులో ‘జల్సా’ అనగానే మనకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది! అదే టైటిల్ ని ఎంచుకున్న విద్యా 2022లో జల్సా చేసేద్దాం అంటూ ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీమేల్ సెంట్రిక్ ఎంటర్టైనర్ షూట్ మొదలు…
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మి రాకెట్’. ఈ సినిమాలో గుజరాత్కు చెందిన అథ్లెట్ క్రీడాకారిణి రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. ఈ చిత్రానికి ఆకాష్ ఖురానా దర్శకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్ విడుదల అవుతుందా.. అనే చర్చలకు కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘రష్మి రాకెట్’ సినిమా జీ5 లో దసరా…
(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి) ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘దిల్ చాహ్ తా హై’. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో యువతను విశేషంగా…
జాలీ గాళ్ జాన్వీ మరోసారి తన ‘అక్సా గ్యాంగ్’తో జనం ముందుకొచ్చేసింది. ‘ఖయామత్’ అంటూ ప్రత్యేకంగా ప్రజెంట్ చేసింది లెటెస్ట్ వీడియోని. తన క్రూతో కలసి యమ సరదాగా డ్యాన్స్ చేస్తూ జాన్వీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ హంగామాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అల్కా యాజ్ఞిక్, సుఖ్వీందర్ సింగ్ అప్పట్లో పాడిన క్లాసిక్ సాంగ్ ‘ఖయామత్’ బాణీలకు బాలీవుడ్ భామ తనదైన రీతిలో ఊగిపోయింది! జాన్వీ కపూర్ బస చేసిన ఖరీదైన…
ఈ మధ్యే కరీనా కపూర్ ఓ సినిమాలో నటించేందుకు 12 కోట్లు డిమాండ్ చేసింది! మరో సినిమాలో భర్త రణవీర్ తో రొమాన్స్ చేసేందుకు దీపికా ఒప్పుకోలేదట! కారణం, ఆమె అడిగినంత ఫీజు నిర్మాతలు ఇవ్వకపోవటమే! బాలీవుడ్ లో డబ్బు కారణంగా సినిమాల్ని బ్యూటీస్ రిజెక్ట్ చేయటం కొత్తేం కాదు. పైగా బీ-టౌన్ ముద్దుగుమ్మలు రోజురోజుకి రేటు పెంచేస్తున్నారు కూడా! కానీ, సోనమ్ కపూర్ కేవలం 11 రూపాయలు తీసుకుని ఓ చక్కటి సినిమా చేసింది… ‘భాగ్…
సినిమా రంగంలోకి ఎంటరై ఏదో ఒక శాఖలో స్థిరపడాలంటే… ముందు సినిమా పట్ల పిచ్చి ఉండాలి! అది ఉన్న వారే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారు! అక్షయ్ కుమార్ జీవితంలోనూ అదే జరిగింది!‘ఖిలాడీ’ స్టార్ గా పేరు తెచ్చుకున్న అక్కీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్. కానీ, ఆయన ఈ స్థితికి ఊరికే రాలేదు. దశాబ్దాల పాటూ పడిన శ్రమ ఉంది. అంతకంటే ముందు చిన్న నాటి సినిమా పిచ్చి ఉంది! దాని…
కంగనా కాంట్రవర్సీల చిట్టా పెద్దదే. అయితే, అందులో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు! కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే! నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది కూడా. అయినా కానీ, కంగనా ఏనాడూ మహేశ్ ని,…