’83’ టీజర్: కపిల్ హైలెట్ క్యాచ్.. ఇండియా జిందాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ’83’. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పడుకొనే సందడి చేయనుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
వెస్టిండీస్ పై వరల్డ్ కప్ ఫైనల్ పోరులో కపిల్ దేవ్ క్యాచ్ పట్టిన తీరు అందరిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక క్రికెట్ అభిమానులు ఇండియా గెలవగానే ఇండియా జిందాబాద్ అంటూ కేకలు వేయడం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. నవంబర్ 30 న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఈ చిత్ర నిర్మాణంలో హీరోయిన్ దీపికా పడుకొనే కూడా ఒక చేయి వేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!