బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీపై రెయిడ్ చేసిన అధికారులు ఆర్యన్ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ ని కేవలం విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నామని.. అతడిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు, కేసు నమోదు కాలేదని ఎన్సీబీ అధికారులు…
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’.. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన గంగూభాయ్ కతియావాడీ బయోపిక్ పాత్రలో గంగూభాయ్ గా ఆలియాభట్ నటించింది. 2019, డిసెంబర్ 8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించగా, రీసెంట్ గా సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్డౌన్, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదల…
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న టెర్రర్ మీడియా థ్రిల్లర్ ‘థమాకా’ మూవీపై అతని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ మధ్వానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు బేస్ 2013లో వచ్చిన కొరియన్ మూవీ ‘ది టెర్రర్ లైవ్’. ఓ బ్రిడ్జ్ ను బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టుని యంగ్ జర్నలిస్ట్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. దాంతో అతనికి బెదిరింపులు రావడం మొదలవుతుంది. ఊహించని ఈ ఉపద్రవం నుండి ఆ జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటికే కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. తాజాగా దీపావళీ పండక్కి థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే థియేటర్లను తిరిగి తెరుస్తామని ప్రకటించడంతో దర్శకుడు రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రాన్ని థియేటర్లో విడుదల…
సౌత్ హిట్ సినిమాలతో పాటుగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.. కాగా, తాజాగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘96’ చిత్రం కూడా బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతుంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్…
పోర్న్ చిత్రాల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు నిన్న బెయిల్ మంజూరు కాగా, నేడు జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా, రాజ్‌కుంద్రా గురించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని చెప్పారు. వాటిని రూ.9 కోట్లకు కుంద్రా బేరానికి పెట్టారని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో…
(సెప్టెంబర్ 21న కరీనా కపూర్ పుట్టినరోజు) కపూర్ ఖాన్ దాన్ లో నాల్గవ తరం తార కరీనా కపూర్. నాలుగు పదులు దాటుతున్నా, నాజూకు షోకులతో నవయువకుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. పటౌడీ వారి కోడలుగా మారిన తరువాత కూడా కరీనా కపూర్ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ మురిపిస్తూనే ఉంది. ఈ నాటికీ కరీనా అందం కుర్రకారుకు బంధం వేస్తూనే ఉండడం ఆమె పతి దేవుడు సైఫ్ అలీ ఖాన్…
ప్రముఖ వ్యాపారవేత్త, స్టార్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ లభించింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ఆయనకు రూ. 50వేల పూచీకత్తుపై బెయిల్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవకాశం కోసం ముంబైకి వచ్చిన పలువురు యువతులను వంచించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో రెండు నెలల క్రితం పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా…
బాలీవుడ్ లోని ప్రముఖులంతా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవడం కామన్ గా మారింది. గతంలోనే కొందరు సెలబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కుకొని జైళ్లకు వెళ్లిన సంఘటనలున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం పలు అభియోగాల కింద కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే రాజ్ కుంద్రా అశ్లీల సినిమాల రాకెట్ ను నడుపుతున్నారని పోలీసులు అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తాజాగా సంచలనంగా మారింది. దీంతో బాలీవుడ్లో మరోసారి…
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు సెప్టెంబర్ 25 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. చీటర్ సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్…