పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ ని గట్టిగా ప్లాన్ చేసిన మేకర్స్ తాజాగా సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ని అభిమానులతో పంచుకున్నారు.
రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ రంగంలోకి దిగినట్లు చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఎపిక్ లవ్ స్టోరీ మీ గాత్రంతో మరింత అందంగా మారనుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇకపోతే అమితాబ్, ప్రబస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మేకర్స్ అడిగిన వెంటనే బిగ్ బి ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి తెలుగులో ఈ స్టార్ హీరో ఈ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారో చూడాలి.
Thank you Shahenshah @SrBachchan for the voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/pxpuF6hfMn
— UV Creations (@UV_Creations) February 22, 2022