‘క్వాహిష్, మర్డర్’ సినిమాలతో సెక్స్ సింబల్ ముద్ర వేయించుకుంది బాలీవుడ్ భామ మల్లికా షెరావత్. ఆమె వయసిప్పుడు 45 సంవత్సరాలు. కానీ అలా కనిపించనే కనిపించదు. అందుకు ఆమె రోజూ చేసే వర్కౌట్స్, యోగానే కారణం. అంతేకాదు… మితాహారం తీసుకోవడంతో పాటు మేని సొగసును కాపాడుకునే ఆహార పదార్థాలనే మల్లికా షెరావత్ ఎక్కడకు వెళ్ళినా స్వీకరిస్తుంది. కమల్ హాసన్ ‘దశావతారం’లోనూ నెగెటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించిన మల్లికా ఇటీవల ఓ వీకెండ్ గోవాలో గడిపేసింది. అక్కడ బికినీ…
హిట్టు కొట్టినోడు ఇరగదీస్తాడు అని సినిమా సామెత. పదేళ్ల క్రితం రిపబ్లిక్ డే రోజున విడుదలైన హృతిక్ రోషన్ మూవీ అగ్నిపథ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దాంతో అభిమానులు ఆ సంబరాన్ని తలచుకుంటూ హృతిక్ సోషల్ మీడియాలో అభినందనలతో సందడిచేశారు. అదేమన్నా సూపర్ డూపర్ హిట్టా అంటే అందేమీ కాదు. నిర్మాతకు మంచి లాభాలు చూపించిన చిత్రమే. బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసినదే. సినీ ట్రేడ్ పండిట్స్ సూపర్ హిట్ అని కితాబు కూడా ఇచ్చారు.…
అన్నీ అనుకున్నట్టు జరిగితే… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హృతిక్ రోషన్, కరీనా కపూర్ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి అభిమానులకు ఓ రకంగా ఇదో శుభవార్త. ‘కభీ ఖుషీ కభీ గమ్’ లాంటి సూపర్ హిట్ మూవీలో నటించిన ఈ సక్సెస్ ఫుల్ జోడీ చివరగా 2003లో ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’లో నటించారు. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై జంటగా నటించే ఛాన్సే రాలేదు. అయితే ఓ ప్రముఖ దర్శకుడు ఇటీవల వీరిద్దరినీ కలిసి…
కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.…
అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ఇటీవలే ఓ శుభవార్త చెప్పారు. సరోగసి ద్వారా తామో బిడ్డకు తల్లిదండ్రులమయ్యామని ప్రకటించారు. దాంతో వీరికి బాలీవుడ్ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్త చాలామందికి సంతోషాన్ని కలిగించింది, కానీ ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిద్వానికి మాత్రం కొంత బాధను మిగల్చబోతోంది. గత యేడాది ఆగస్ట్ లో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అలియా భట్ తో తన…
2008లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘బధాయి హో’ టైటిల్ ను బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంచక్కా వాడేసుకుంటున్నారు. ఆ కథతో సంబంధం లేకుండానే, వేరే వేరే నటీనటులతో ‘బదాయి దో’ అనే సినిమా తీసేశారు. రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి భూమి అంటే ప్రేమ. చూస్తుండగానే ఆమెకు 31 సంవత్సరాలు, అతనికి…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి…
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో లైగర్ సినిమాతో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గెహ్రయాన్’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా అనన్య…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక…