ఒక సినిమా కోసం హీరోహీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వారు ఎంతో శ్రమిస్తారు. చిత్రం విడుదలయ్యాకా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ వారి కష్టానికి ప్రతి ఫలం. సినిమాలో కష్టమైన ఫైట్ కోసమో, సాంగ్ కోసమో ముందు నుంచే వారు రిహార్సల్స్ చేస్తారు. ఇక క్రీడల నేపథ్యంలో సినిమాలైతే కొన్ని రోజులు వారు కూడా క్రీడాకారులుగా మారిపోతారు. తాజాగా ‘దంగల్’ బ్యూటీ.. తాను ఆ…
తెలుగు చిత్రాలు -యన్టీఆర్ ‘జయసింహ’, ఏయన్నార్ ‘రోజులు మారాయి’తోనే వెలుగు చూసిన వహిదా రెహమాన్, హిందీ చిత్రసీమలో అందాలతారగా రాజ్యమేలారు. 1956లో గురుదత్ తన ‘సి.ఐ.డి.’ సినిమాతో వహిదాను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో బొంబాయితారగానే మిగిలిపోయారు వహిదా రెహమాన్. మొదట్లో గురుదత్, దేవానంద్ చిత్రాలలోనే మురిపించిన వహిదా రెహమాన్ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలా ఆమెకు తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘బీస్ సాల్ బాద్’. బిశ్వజిత్…
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ హిట్ సినిమా జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం షాహిద్ ఎంతగానో కష్టపడ్డాడు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ప్రముఖ ఓటిటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ రాగా…
1983లో తొలిసారి క్రికెట్ లో వరల్డ్ కప్ ను భారతదేశం కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. ఆ సుమధుర ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’83’ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. మన దేశంలో హిందీతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాలలోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు త్రీడీలోనూ ఈ మూవీని సిద్దం చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ’83’ రన్ టైన్ ను రెండు గంటల 42 నిమిషాల 52 సెకన్లకు…
బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సినిమాలకు ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘మేడే’. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. అయితే ‘మేడే’ మూవీ టైటిల్ ఇప్పుడు మారిపోయింది. తమ సినిమా పేరును ‘రన్‌వే 34’గా మారుస్తున్నట్లు హీరో అజయ్‌దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టైటిల్ మార్పుకు కారణాలను అతడు చెప్పలేదు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోంది.…
సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నో ఎంట్రీ’ సినిమా ఒకటి. సల్మాన్ తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ మల్టీస్టారర్ 2005లో బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
టీమిండియాను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ’83’. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పడుకొనే సందడి చేయనుంది. 1983…
బాలీవుడ్ న్యూ కిడ్ అహన్ శెట్టి ‘తడప్’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్ఎక్స్ 100’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ శెట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నా రొమాన్స్ విషయంలో మాత్రం అహన్ వణికిపోయాడంట.. తాజగా ఈ సినిమా ప్రమోషన్ లో అహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి సినిమాలోనే హాట్ హీరోయిన్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం…
ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా…