1983లో తొలిసారి క్రికెట్ లో వరల్డ్ కప్ ను భారతదేశం కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. ఆ సుమధుర ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’83’ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. మన దేశంలో హిందీతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాలలోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు త్రీడీలోనూ ఈ మూవీని సిద్దం చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ’83’ రన్ టైన్ ను రెండు గంటల 42 నిమిషాల 52 సెకన్లకు లాక్ చేశారు దర్శకుడు కబీర్ ఖాన్.
అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. కపిల్ దేవ్‌గా రణవీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె, సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్‌గా హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్‌నాథ్‌గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారె, రవిశాస్త్రిగా కార్వా.. మేనేజర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు.