బాలీవుడ్ న్యూ కిడ్ అహన్ శెట్టి ‘తడప్’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్ఎక్స్ 100’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ శెట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నా రొమాన్స్ విషయంలో మాత్రం అహన్ వణికిపోయాడంట.. తాజగా ఈ సినిమా ప్రమోషన్ లో అహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
మొదటి సినిమాలోనే హాట్ హీరోయిన్ తారా సుతారియాతో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉన్నా.. ఆమెతో రొమాన్స్ అనగానే వణికిపోయానని చెప్పుకొచ్చాడు. మొదటి షాట్ ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోవాలన్నప్పుడు చెమటలు పట్టి, చేతుల్లో షివరింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీంతో డైరెక్టర్ ‘డర్టీ పిక్చర్’ సినిమా చూపించి ఎలా ముద్దు పెట్టాలని నేర్పించాడని, ఆ తరువాత కాస్త కష్టమైన తారా సుతారియాతో లిప్ లాక్ లాగించేశానని చెప్పాడు. కొద్దిరోజులు షూటింగ్ లో బెరుకుగా ఉన్నా ఆ తర్వాత తారా, తాను మంచి ఫ్రెండ్స్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాతో ఈ వారసుడు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.