విజయవంతమైన సినిమాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ ఖిలాడీకి తిరుగులేదు. భాష ఏదైనా హిట్ అయిందంటే చాలు అక్షయ్ కుమార్ రీమేక్ రైట్స్ తీసుకోవడం జరిగిపోతాయి. ఇక టాలీవుడ్ లో హిట్ అయిన గద్దలకొండ గణేష్ సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో బచ్చన్ పాండే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్…
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే సమయంలో ముందుగా ప్రకటించినట్టు ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ మాత్రం ఆగస్ట్ 11న రావడం లేదు. ఆ చిత్రాన్ని దర్శక నిర్మాతలు కాస్తంత వెనక్కి పంపుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తెలిపాడు. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుసులో ఏమనుకుంటుందో అది ఏమాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టేస్తుంది. హీరో, హీరోయిన్, రాజకీయాలు అనే తేడా కూడా ఉండదు. ఇక తాజాగా అమ్మడు దీపికా సినిమాపై పడింది. ఇటీవల దీపికా పదుకొనే,న అనన్య, సిద్దాంత్ నటించిన ‘గెహ్రియాన్’ సినిమా అమెజాన్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. ఘాటు వ్యాఖ్యలతో మరో…
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బడే మియా చోటే మియా’. ఇదే టైటిల్ తో బిగ్ బి అమితాబ్, గోవిందాతో 1998లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషు భగ్నాని ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా దీని బడ్జెట్ ను రూ. 300 కోట్లకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలనాటి ‘బడే మియా చోటే మియా’లో అమితాబ్, గోవింద ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. డేవిడ్…
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని…
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని, ఇక ప్రేక్షకుల ప్రేమ అందుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.…
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడటం బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కు చేతకాదు. ఏ విషయం గురించైనా తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఆమె రకరకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ వస్తోంది. చిత్రం ఏమంటే కంగనా రనౌత్ మీడియా ముందుకు వస్తే చాలు… ఆమెను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కాంట్రావర్సీ లోకి లాగడం ఉత్తరాది మీడియాకు అలవాటుగా మారింది. అలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హీరో షాహిద్…
1983లో భారత్ వరల్డ్ కప్ ను గెలుస్తుందని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ క్రికెట్ టీమ్ సుసాధ్యం చేసింది. అయితే… ఆ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో తెరకెక్కిన ’83’ సినిమా సునాయాసంగా విజయపథంతో సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా అవరోధాలను ఈ మూవీ ఎదుర్కోవాల్సి వచ్చింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించినా, స్వయంగా కపిల్ దేవ్ ఈ మూవీని…