విజయవంతమైన సినిమాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ ఖిలాడీకి తిరుగులేదు. భాష ఏదైనా హిట్ అయిందంటే చాలు అక్షయ్ కుమార్ రీమేక్ రైట్స్ తీసుకోవడం జరిగిపోతాయి. ఇక టాలీవుడ్ లో హిట్ అయిన గద్దలకొండ గణేష్ సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో బచ్చన్ పాండే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కృతిసనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వార్సి కీలక పాత్రలలో నటించిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకొంటుంది. అయితే గద్దలకొండ గణేష్ లైన్ ని మాత్రం వాడుకొని పాత్రలు, కథాంశం మార్చినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. కరుడుగట్టిన ఒక గ్యాంగస్టార్ బయోపిక్ ని తీయడానికి లేడీ డైరెక్టర్ అయినా కృతిసనన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆమె, అతడి స్నేహితుడు అర్షద్ వార్సి సహాయం తీసుకొంటుంది.
ఇక అన్నిచోట్లా తిరిగి బచ్చన్ పాండే రౌడీయిజం గురించి తెలుసుకొని అతడి కథను సినిమాగా తీద్దామని అతడిని ఎలాగోలా ఒప్పించి షూటింగ్ స్టార్ట్ చేస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో మరణించిన బచ్చన్ పాండే ప్రేమికురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించింది. అస్సలు బచ్చన్ పాండే కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ లా ఎలా మారాడు..? ఎందుకు మారాల్సి వచ్చింది. గతంలో బచ్చన్ పాండే లవ్ స్టోరీ ఏంటి..? చివరకు లేడీ డైరెక్టర్ క్రూరమైన గ్యాంగ్ స్టార్ బయోపిక్ ని తీసిందా..? అనేది తెరపై చూడాలి అంటున్నారు మేకర్స్. బచ్చన్ పాండే లుక్ లోఅక్షయ్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. గుబురు గడ్డం..మాస్ లుక్ లో వరుణ్ తేజ్ గడ్డలకొండ గణేష్ గా బాగానే భయపెట్టిన సంగతి తెలిసిందే. ఇక బచ్చన్ పాండేగా అక్షయ్ కుమార్ లుక్ ఇంకా భయంకరంగా ఉంది. మరి గడ్డలకొండ గణేష్ కన్నా బచ్చన్ పాండే ఎక్కువ బయపెడతాడేమో చూడాలంటే 2022 మార్చి 18 వరకు ఆగాల్సిందే.