ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఇంజనీర్లను తొలగిస్తున్నారు. రెండు భారీ క్రేన్లతో బోట్లను తొలగిస్తున్నారు. బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను నది ప్రవాహం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లను వైర్లతో లాక్ చేసి నదిలో వంగిపోయిన బోటును రివర్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత.. బోటును డైరెక్షన్ మార్చేందుకు చూస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ రోజు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేరుకున్న కౌంటర్ వెయిట్ల అమరిక గురించి అధికారును అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని…
ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్‌లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు.
కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం నెలకొంది.. కృష్ణానదిలో ప్రయాణికులను సంగమేశ్వరానికి తరలించే విషయంలో రెండు రాష్ట్రాలకు చెందిన బోటు నిర్వాహకుల మధ్య ఈ తాజా వివాదం చోటు చేసుకుంది.. నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. కృష్ణానది మధ్యలోనే పడవలపై కొట్టుకోవాడానికే సిద్ధమయ్యారు ఇరు రాష్ట్రాల బోటు నిర్వాహకులు.. తెలంగాణ బోట్లను సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకే నడపాలన్నారు ఏపీ బోటు నిర్వాహకులు.. సంగమేశ్వరం గుడికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో,…
Papikondalu: గోదావరిపై పాపికొండల యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొంతకాలంగా గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోట్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాపికొండలు వెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగా గోదావరి నదిపై ప్రయాణించి భద్రాచలం వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఈ మేరకు తమ బోట్లను నడిపేందుకు, పర్యాటకులను పాపికొండలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని…
మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం. తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి. హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది. పాతబస్తీ బాబా నగర్ లో యువకులు కొందరు బోట్లతో షికారు చేస్తూ కనిపించారు.హైదరాబాద్ బోట్ల వినియోగం గతంలోనూ కనిపించింది. వర్షాకాలం వస్తే బోట్లు అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు గతంలో కోరిన సందర్భాలున్నాయి. ఒకవైపు కాలనీల్లో…
గుజరాత్‌లో కడలి కల్లోలం సృష్టించింది. దీంతో 12 మత్స్యకారుల బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. 12 బోట్లలో మొత్తం 23 మంది మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని సురక్షితంగా కాపాడు. మిగతా 12 మంది మత్స్యకారుల కోసం అధికారులు గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి వాతారవణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ, అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. Read: ఇలాంటి పెళ్లి పత్రికను ఎక్కడా…
విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ రెండు పడవల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద జరిగింది. తెలంగాణలో లాక్‌డౌన్ కావడంతో వీరంతా సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి…