మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం. తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి. హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది. పాతబస్తీ బాబా నగర్ లో యువకులు కొందరు బోట్లతో షికారు చేస్తూ కనిపించారు.హైదరాబాద్ బోట్ల వినియోగం గతంలోనూ కనిపించింది. వర్షాకాలం వస్తే బోట్లు అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు గతంలో కోరిన సందర్భాలున్నాయి. ఒకవైపు కాలనీల్లో నీళ్ళు చేరితే యువకులు ఆ నీటిలో ఈత కొడుతూ తమ సరదాలు తీర్చుకుంటున్నారు. అత్తాపూర్ పోలీస్ ఔట్ పోస్ట్ లోకి వర్షం నీరు చేరింది. సీలింగ్ కూలిపోయింది. నీటిని బయటికి ఎత్తిపోస్తున్నారు సిబ్బంది.
అల్పపీడనం ప్రభావం వల్ల ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేటలలో వాన పడింది. అలాగే అబ్దుల్లాపుర్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బుద్వేల్, శివరాంపల్లిలో యూసఫ్‌గూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో ఉరుములతో కూడిన వాన కురవడంతో వాతావరణం చల్లబడింది.
ఈదురుగాలులు, వర్షాలకు పలు ప్రాంతాల్లో కూలిపోయాయి హోర్డింగ్స్. చార్మినార్, మలక్ పేట్, బహదూర్ పురాలో, చాదర్ ఘాట్ లో కూలాయి హోర్డింగ్స్, ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయింది వరదనీరు. దీంతో మోటార్ల సహాయంతో వర్షపు నీటిని తొలగిస్తున్నాయి డీఆర్ఎఫ్ బృందాలు. 19 జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేసింది బల్దియా. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. వాన కారణంగా వాతావరణం చల్లబడినా ఇళ్ళలోకి నీరు చేరడంతో జనం బయటకు రావడానికి ఇబ్బందిపడుతున్నారు. సికింద్రాబాద్ పరిసరాల్లోని పలు కాలనీ సెల్లార్ లోకి నీళ్ళు ప్రవేశించాయి.
Andhrapradesh Rains: ఏపీలో వర్షాలు… చల్లబడిన వాతావరణం