విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ రెండు పడవల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద జరిగింది. తెలంగాణలో లాక్‌డౌన్ కావడంతో వీరంతా సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి కోసం అధికారులు రంగంలోకి దిగారు.