ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు. రెండు భారీ క్రేన్లతో బోట్లను తొలగిస్తున్నారు. బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను నది ప్రవాహం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లను వైర్లతో లాక్ చేసి నదిలో వంగిపోయిన బోటును రివర్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత.. బోటును డైరెక్షన్ మార్చేందుకు చూస్తున్నారు. అలా అయితే.. ఆ బోటు నది ప్రవాహంలో వెళ్లిపోతుంది.
Read Also: Devara: ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది.. దేవరా!!
ఈ క్రమంలో.. బోటు ఉన్న ప్రాంతంలో గేట్లను ఎత్తేసి ఈ చర్యను చేపట్టారు. దాదాపు 50 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. బోటను లిఫ్ట్ చేసేందుకు లిఫ్టింగ్ క్రేన్ చైన్ సాయంతో డైరెక్షన్ మార్చేలా ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత.. నది ప్రవాహానికి ఆ బోటు కొట్టుకుని పోయి ముందు ఎక్కడైనా ఆగిన తర్వాత రికవరీ చేసుకుంటారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ బోట్లను తొలగించేందుకు.. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు పనులు చేస్తున్నారు.
Read Also: Haryana Polls: రెండో జాబితాను విడుదల చేసిన ఆప్.. 9 మంది ప్రకటన
ఇంజనీరింగ్ అధికారులు మాట్లాడుతూ.. ఒకదాని మీద ఒకటి ఓటు ఎక్కడంతో అవి ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అందుకోసమే.. ఆ బోటు కదలలేకుండా ఉందని చెబుతున్నారు. ప్రయత్నమైతే చేస్తున్నాం.. బోటు అడుగున లాక్ అయిపోయిందని.. లాక్ రిలీజ్ అయితేనే బోటు పక్కకు కదిలే అవకాశముందని అంటున్నారు. మరోవైపు.. నది లోపలకు వెళ్లి లాక్ ఎక్కడ పట్టుకుందో చూడటానికి డైవింగ్ టీమ్ వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బోటును మూడు ముక్కల కింద కోసేసి తీయడం, లేదంటే నీళ్లలోకి బెలూన్లలోకి దించి పక్కకు జరిపే ప్రయత్నం చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ విధంగా బోట్లను తొలగించేందుకు అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు.