శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. జయజయహే తెలంగాణాకు ఆంధ్ర వ్యక్తి ఎం.ఎం కీరవాణి సంగీతం ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం అవుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లికి దండ వేయని వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహ రూపం రూపొందించారని దుయ్యబట్టారు. తెలంగాణ విగ్రహ రూపం మార్చడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ, బోనాలు ఆ రెండూ లేకుండా విగ్రహం రూపొందించారని ఆగ్రహ వ్యక్తం చేశారు. మరోవైపు.. 2.64 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది అంటే అందులో కాళేశ్వరం పాత్ర కూడా ఉందని వెల్లడించారు. మేడిగడ్డను బూచిగా చూపించారు.. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. పంటలను గొర్రెలు, పశువులు మేస్తున్నాయని కవిత పేర్కొన్నారు. సూటు బూటు వేసుకుని ఉద్యోగం చేయడమే కాదు.. గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుని ఉపాధి పొందడం కూడా ఉపాధేనని తెలిపారు.
Read Also: Asia Record: 24 గంటల్లో 87 లీటర్ల పాలు ఇచ్చిన గోమాత!
బోనస్ బోగస్‌గా మారిపోయింది.. మహాలక్ష్మిని పాక్షికంగా మాత్రమే అమలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. మహిళలకు 2,500లు తక్షణమే చెల్లించాలి.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూది లేదు. దూది లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ రిపోర్ట్ పూర్తిగా టేబుల్ చేయాలి.. పరిశ్రమలు రాష్ట్రం వదిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.. గతంలో ఉన్న పరిశ్రమలు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. హైడ్రాతో నిరంతరం విధ్వంసం చేస్తున్నారని అన్నారు.
Read Also: Robinhood : నటుడిగా డేవిడ్ వార్నర్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇక బ్యాటింగే
మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు.. దీని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్‌గా న్యూసెన్స్ అనే పదం వాడారు.. దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గతంలో కూడా తమ సభ్యులపై ఏకవచనంతో మాట్లాడారు.. శాసనసభలో, మండలిలో బీఆర్ఎస్ సభ్యులకు సముచిత స్థానం కల్పించడం లేదని తెలిపారు. అసెంబ్లీలో తమ సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో తమ మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతుందని కవిత పేర్కొన్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదు.. అందుకే ఆయన తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ముస్లిం, లంబాడా వారికి చోటు దక్కలేదని కవిత ఆరోపించారు.