కరీంనగర్ అబాది జమ్మికుంట బీజేపీ పార్టీలో ఈ రోజు భారీగా చేరికల జరిగాయి. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేసారు ఈటల రాజేందర్. మీ డబ్బులకు, మీ మద్యం సీసాలకు నాగార్జునసాగర్ కోదాడలో రిజల్ట్ రావచ్చు. కానీ హుజురాబాద్ లో మాత్రం ఆత్మగౌరవానికే రిజల్ట్ వస్తుంది అని స్పష్టం చేసారు. ఆత్మగౌరవ ప్రతీక,పేదప్రజల గొంతుక ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎవరి ఫ్లెక్సీలు, ఎవరి ముఖాలు ఉన్నాయి. ఈటల ఫ్లెక్సీలు, జెండాల పెడితే చింపివేశారు. మీ ఫ్లెక్సీలు,జెండాలు,గోడమీద రాతలు అక్కడే ఉంటాయి కానీ నా ఫోటో మాత్రం హుజురాబాద్ ప్రజల గుండెల్లో ఉంటుంది అన్నారు. మీవి చెరిపేస్తే చెరిగిపోతాయి,గాలి వస్తే చినిగిపోతాయి కానీ ఈ బిడ్డ ఫోటో మాత్రం పోయేది ప్రజలకు నచ్చని పని చేసినప్పుడే… తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అధికారం భారత రాజ్యాంగం కల్పించింది.
కానీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న పార్టీ టిఆర్ఎస్. మీతో పాటు జాయిన్ అయినా సర్పంచులు,ఎంపీటీసీలు నాతో టచ్ ఉంటున్నారని మర్చిపోకండి. మేము చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు తీరక పోయినాము అంటున్నారు. ఇప్పుడు బిల్లులు వచ్చినై డబ్బులు వచ్చినవి ఇక నీతో పాటే ఉంటాం అంటున్నారు. కానీ నేను అందరిని రానిస్తాలేను. న్యాయంగా ప్రజల మీద నమ్మకంగా నిజమైన సపోర్ట్ చేసే వారిని రానిస్తాను ద్రోహం చేసే వారిని మాత్రం రానివ్వను అని ఈటల పేర్కొన్నారు.