బీజేపీలో కీలకమైన జాతీయ కార్యవర్గ సభ్యులను నిన్నటి రోజున ప్రకటించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు కొంతమందికి కార్యవర్గంలో చోటు దక్కింది. వీరితో పాటుగా విజయశాంతికి కూడా కీలక పదవిని అప్పగించారు. విజయశాంతికి జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. జాతీయ పార్టీ తెలంగాణపై పూర్తి దృష్టి సారించేందుకు సిద్దమైనట్టు తెలుస్తున్నది. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవిని కూడా అప్పగించడంతో తెలంగాణపై మరింత పట్టు సాధించవచ్చని పార్టీ భావిస్తోంది. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న విజయశాంతికి కూడా కీలక పదవిని అప్పగించడం వెనుక కూడా ఇదే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, అటు తమిళనాడులోకి నేతలకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన మురుగన్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించగా, అన్నామలైకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కాగా, కుష్బూకు కుడా కీలక పదవిని అప్పగిస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కుష్బూకు కేంద్ర కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. కేంద్ర పార్టీలో కుష్బూకు కీలక పదవి దక్కడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read: విజయవాడలో మొదటిసారి త్రిశూల్ రైలు… ప్రత్యేకతలు ఇవే…