హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు కొంటునట్లు ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూ, తెలంగాణ ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారో టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈటల కోసం పని చేస్తున్న కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అయితే ఇకపై వాటిని సహించేది లేదని హెచ్చరించారు డీకే అరుణ. జాతీయ, రాష్ట్ర పార్టీ మొత్తం ఈటల వెంట ఉన్నారన్న విషయం తెరాస నాయకులు మరవద్దని గుర్తు చేసిన ఆమె.. పోలీసులు హుజురాబాద్ లో వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉందని, వారు ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చారు. కేవలం బీజేపీ పార్టీ నాయకులే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఈటల గెలుపును కోరుకుంటున్నారని, దాని కోసం అందరూ స్వచ్ఛందంగా హుజురాబాద్ కు వచ్చి ఈటల గెలుపు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు డీకే అరుణ.
Also Read
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!