వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్‌సీయూ భూములను వారు సందర్శించనున్నారు. వాస్తవ పరిస్థితిలు తెలుసుకునేందుకు ఈ సందర్శన కొనసాగనుంది. హెచ్‌సీయూ భూముల వేలాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది.
READ MORE: Court Movie : అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ‘కోర్టు’ మూవీ
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్షజాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. భూముల వేలం రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. భూముల వేలం రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కోసం భారాస 25 లక్షల చెట్లను నరికివేసిందని విమర్శించారు.
హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను(పర్యావరణానికి నష్టం కలిగించే మొక్కలు) బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్ చేరిందని పేర్కొన్నారు. అదే గొడ్డలి.. కొత్త చేతులని పేర్కొన్నారు. తెలంగాణలో అటవీ నిర్మూలన మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సంజయ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలనుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది.