ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు.. అయినా ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లవ్ కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతోంది.. జనసేన పార్టీని ఉద్దేశించి చంద్రబాబు ఆ కామెంట్లు చేయగా.. బీజేపీ, వైసీపీ ఈ వ్యవహారంపై మండిపడుతోంది.. జనసేన పార్టీ తమకు మిత్రపక్షమని బీజేపీ అంటుంటే.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్కసారైనా గెలిచారా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా పర్యటనలో…
బీజేపీ నాయకురాలు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు హై కోర్టులో ఊరట లభించింది. బొడిగె శోభను రూ. 25 వేల పూచీకత్తుతో విడుదల చేయాలని పోలీసులను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల బదీలీ విషయంలో ఉన్న జీవో నెంబర్ 317 ను సవరించాలని జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షలో బండి సంజయ్, బొడిగె శోభతో సహా మొత్తం 17 మందిని…
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో భేటీ అంశాలను వీర్రాజు మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. దేశ బోర్డరుకు పది కిలోమీటర్లు, పాకిస్తాన్‌కు దగ్గరలో ఉన్న ప్రాంతమని అలాంటి చోట ప్రధానికి రక్షణ కల్పించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందన్నారు. ప్రధాని లాంటి పెద్దలకు బ్రిడ్జిలు వచ్చినప్పుడు భద్రత…
ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ప్రారంభమైన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు. ఈ సభలు ఇవాళ్టినుంచి ఈనెల 10 వరకు జరగనున్నాయి. కాగా ఈ కార్యక్రమాలకు సీపీఐజనరల్ సెక్రటరీ డి. రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఏ ఐవైఎఫ్ నాకు తల్లి లాంటిదన్నారు. కమ్యూనిస్టు పార్టీ భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిందన్నారు. కాంగ్రెస్‌తో పాటు ముందుండి పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. బీజేపీ,…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పని చేస్తున్న సంస్థల పథాధికారుల సమన్వయ సమావేశాలు ఈరోజుతో ముగిశాయి.ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు భాగ్యనగర్(హైదరాబాద్) శివారు అన్నోజీ గూడలో ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబళేతో పాటు అయిదుగురు సహాసర్ కార్యవాహలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ హాజరయ్యారు. ఈ…
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH…
దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్వాగత సభ అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు..…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. ఈ సందర్భంగా స్వాగత సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ సభలో సంజయ్ మాట్లాడుతూ.. మరోసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్…
హైదరాబాద్‌లో వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి.. అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసిపోయాయి.. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ మీటింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. కాంగ్రెస్ పార్టీ 120 మందితో 9 నుంచి 11 వరకు హైదరాబాద్ శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. 300 మందితో సంఘ్ శిక్షణకు భద్రత, అనుమతి…