బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కొత్తగా నిర్మించాల్సి వస్తే అంబేద్కర్ నే ప్రేరణగా తీసుకుంటారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు తేవాలన్నదే సీఎం ఆలోచన అని, బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రాజ్యాంగం పై చర్చ పెట్టండి అని ఆయన సవాల్ విసిరారు. స్వాతంత్రము వచ్చిన ఇన్నేళ్ల లో బడుగు బలహీన వర్గాలు జీవితాలు…
సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై నిన్న బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు.. ఇక, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదని దుయ్యబట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే…
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన దేనికి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పారన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.. ఇక, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్రమే సీఎం కేసీఆర్ అన్నారని.. కేసీఆర్ మాట్లాడిన…
తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మారిపోయింది.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని వదిలి.. ఇప్పుడు మొత్తం బీజేపీపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీజేపీ వైపు తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నారని వ్యాఖ్యానించారు.. కేసీఆర్ తెలంగాణ లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడన్న ఆయన.. చూసే వాళ్లకు అందరికి తుపాకీ ఎక్కుపెట్టిన దిక్కే కాల్చుతాడు అనిపిస్తుంది.. కానీ,…
పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి. ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు అని ఆయన అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల…
కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తానని చెప్పిన రైతు ద్రోహివి అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. దాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని.. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చిందే నీవే అంటూ మండిపడ్డారు. ఫ్రీ యూరియా ఇస్తా అని హామీ ఇచ్చావు కదా.. ఇచ్చావా..? అని ప్రశ్నించారు. 317జీఓ మంచిదే అయితే 10 మంది ఎందుకు చనిపోయారని ఆగ్రహించారు. భార్య భర్తలను, తల్లి పిల్లలను విడగొట్టిన మూర్ఖుడని.. ని కొడుకు,…
2022 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడారు.దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మనిర్భర భారత్ సాధికారత సాధ్యమయ్యేలా బడ్జెట్ రూప కల్పన చేశారన్నారు. పీఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుండి మొదలుకుని ఆవాస్ యోజన ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం…