కాపు రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా కాపు రిజర్వేషన్ల గురించి రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి వున్నారని ఆయన అన్నారు. మూడు దశాబ్దాలుగా తమకు న్యాయం జరగాలని కాపులు ఉద్యమాలు చేశారన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కాపుల విషయంలో రిజర్వేషన్లు రాష్ట్రం అమలుచేయలేదన్నారు. కేంద్రంపై నెపం నెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇలాంటి వైఖరి అమలుచేసిందన్నారు జీవీఎల్.