బండి సంజయ్ నీ మిలియన్ మార్చ్ మోడీ దగ్గర చేయి మాదగ్గర కాదు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాటల దాడికి దిగారు. కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో…
కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి nrgs నిధులు మంజూరు చేసిందని రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం కేవలం టీఆర్ఎస్ సర్పంచ్‌లకే ఇచ్చారన్నారు. రూ. 53 కోట్ల నిధులు వస్తే మాకు కేవలం 3 కోట్ల నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు. Nrgs నిధులు మాకు అన్యాయం జరిగింది.మా నియోజకవర్గ కు ఎన్ని నిధులు రావాలో అవి రావాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రెండు మూడు నెలలు…
తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులుగా మేమంతా ఆరోజు పోరాడాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిరుద్యోగ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఒకే కులానికి మంత్రి పదవులు ఉన్నాయని, ఇతర కులాలకు పనికిరాని పదవులు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..ఉద్యోగాలు అక్కడ లేవు..ఇక్కడ లేవు.. ఉద్యోగాలు వచ్చే వరకు…
తెలంగాణ లో నిరుద్యోగ భృతి ఇస్తా అని మూడేళ్ళయింది.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి అన్నారు. నిరుద్యోగుల యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని, యువకుడు ముత్యాల సాగర్ చనిపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ ల ముట్టడి చేసాం.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత చనిపోయారు…ఆ అమరవీరుల సాక్షిగా గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టాం ,నివాళులు అర్పించామని ఆయన అన్నారు. సీఆర్ నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా.. 2018 లో ఎన్నికల్లో…
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా నందిపేట ఎంపీటీసీ అరుణ చవాన్ పార్టీని వీడి ఆదివారం టీఆర్ఎస్లో చేరడంతో తెలంగాణ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ కె.కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన నందిపేట పర్యటనలో రాజకీయ మైలేజీని పొందేందుకు రైతులను ఖలిస్తాన్‌తో పోల్చినందుకు అరుణ మరియు ఆమె మద్దతుదారులు తప్పు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ 2019…
నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని..అందరరం కలిసి కేసీఆర్ అంతు చూద్దామని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చిందని బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ తెలిపారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. Read Also:…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ పై తీవ్రంగా విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదు. సీఎం మాటలకు… చేతలకూ పొంతన లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులుసహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం…
క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వందలక కోట్ల డాలర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలానత్మక కథనం ప్రచురించింది. ‘ ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భారత్‌లో మరోసారి పెగాసిస్ అంశం ప్రధాన వార్తగా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం…
రేపటి నుంచి బీజేపీ ‘మైక్రో డొనేషన్స్’ షురూ కానుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి ‘మైక్రో డొనేషన్స్’ పేరిట చిన్న మొత్తాలను విరాళాలుగా సేకరించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘మైక్రో డొనేషన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. Read Also: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నా:…