తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కుట్ర కేసులో కీలక దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ డ్రైవర్ ను, పీఏను విచారించనున్నారు పోలీసులు. అలాగే, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ల పాత్ర పై విచారణ చేయనున్నారు పోలీసులు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారు…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణ సంచలనంగా మారిపోయింది.. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర… మహబూబ్ నగర్‌కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాథ్, నాగరాజు ఈ హత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడిందన్నారు.. ఫిబ్రవరి 23వ…
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్ అక్రమాల కేసుకు.. ఈ ప్లాన్‌కు లింక్ ఉన్నట్టు ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. గతంలో శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్లో అక్రమాలున్నాయంటూ ఫిర్యాదులు ఉన్నాయి.. ఆ ఫిర్యాదులు ఇచ్చినవారినే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఆ కిడ్నాప్ కేసుకు.. ప్రస్తుత హత్య కుట్ర కేసుకు లింకులు తెరపైకి వచ్చినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగం వుండడం లేదు. ఈ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా తిప్పికొట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం కెసిఆర్ సమక్షంలో సభలు హుందాగా జరిగాయి..జరగబోతున్నాయి. అధికార పార్టీ సభ్యుల కంటే…ప్రతిపక్ష పార్టీ సభ్యులకే ఎక్కువ సమయం ఇస్తుంది మేమే. విపక్ష సభ్యులు ఇక చాలు అనే వరకు సమాధానాలు ఇస్తున్నాం. .…
ఉక్రెయిన్ లో తెలుగు బిడ్డలు చిక్కుకుంటే కనీసం సమీక్ష నిర్వహించలేదు.. ఒక్క విద్యార్తి తో అయినా మాట్లాడారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవ్వాళ వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతాలు పలుకుతున్నారు.. సిగ్గుండాలి వాళ్లకు అని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ను గజగజ వణికిస్తున్న పార్టీ బీజేపీ అని, నువ్వేం చేయలేవు.. నీతో ఏమి కాదు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. మూర్ఖుడు, అతడి కుటుంబం తెలంగాణను ఏలుతోందని, శ్రీకాంత చారి, ఉద్యమకారుల…
పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, ప్రతి కార్యకర్త ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని ఆయన అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఆ రాష్ట్ర నాయకులు సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ ఒక్క రాష్ట్రం సక్సెస్ కాలేదన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువే…
నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందే యూత్ కాంగ్రెస్ తో అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ కోటాలో మంత్రిని అయ్యాయని, నాదేమి పెద్ద కుటుంబం కాదన ఆయన అన్నారు. పని చేస్తే ఎమ్మెల్యే లు..మంత్రులు అవుతారని, కష్టపడి పని చేయండి.. రాహుల్ గాంధీ టికెట్స్ కూడా ఇస్తారని ఆయన వెల్లడించారు. ఖాళీ లు వెంటనే పూర్తి చేయాలని, నిరుద్యోగులు రోడ్ల మీదకు రావాలన్నారు. అందరితో కలిసి…
కాంగ్రెస్ లో నాటకాలు, డ్రామాలు కుదరవు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలు సరిగా ఉన్నా, నేతల మద్య సమన్వయం లేదన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని, కేసీఆర్ తెలంగాణలో లూటీ ముగియడంతో … బంగారు భారతదేశం అంటూ దేశంలో లూటీకి కోసం వస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు పై బీజేపి డ్రామాలాడుతోందని, పార్లమెంట్‌కు తాళం వేసి తెలంగాణ…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందన్నారు.. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకుని రావాలని చూడ్డం శోచనీయమన్న ఆమె.. వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకుని అప్పులకు వెళ్తున్నారని విమర్శించారు.. ఉన్న ఆస్తులను అమ్ముకోవడం చూస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని అర్ధం…
ఆ శివుడు ఊరుకోడు.. మూడో కన్ను తెరుస్తాడు.. సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తాడు అని ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇస్తా అన్నాడు.. అందుకు రూ. 700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు..…