గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కాంగ్రెస్ ను ఏం చేస్తారనేది జీ23 నేతలే చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు క్వార్టర్ పొడిగించాలని ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వెళ్లాయన్నారు. దీనిక వెనక మతలబు ఏంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా… బీజేపీ తమకు శతృవునేనన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది ఎన్నికలు వచ్చాకే చెబుతామన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పాటైతే దక్షిణ భారతదేశం నష్టపోతుందన్నారు. అది మరో ఉద్యమానికి కారణం అవుతుందన్నారు అసదుద్దీన్. జమ్మూకశ్మీర్‌లో పోటీ చేయబోమన్నారు.
Read also: UP: యోగి ప్రమాణస్వీకారం అప్పుడేనా..?
పోటీ చేయడం.. ఓడించడం.. గెలవడమే మా పాలసీ అన్నారు ఒవైసీ.. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్స్ బలహీన పడుతుందన్నారు.. ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ, ఒరిస్సా మద్దతు తప్పని సరి అన్నారు.. ఇక, నియోజక వర్గాల పునర్విభజన మరో ఉద్యమానికి కారణం అవుతుందన్న ఆయన.. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల విభజన జరిగితే దక్షిణ భారత దేశం నష్టపోతుంది.. దక్షిణాదిన జనాభా నియంత్రణ ఎక్కువ… ఉత్తర భారతంలో నియంత్రణ ఉండదన్నారు ఒవైసీ.