AIMIM MP Asaduddin Owaisi meet Minister KTR Today At Assembly.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే ఇటీవలే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. యూపీలో 100 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్‌ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల క్రితం కేటీఆర్ అపాయింట్ మెంట్ అసదుద్దీన్ కోరడంతో.. ఇవాళ అసెంబ్లీకి రమ్మని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేటీఆర్‌తో సమావేశం అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల ఫలితాల పై కేటీఆర్‌తో చర్చలు జరుపలేదని, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష చేశామన్నారు.
యూపీ ఎన్నికల ఫలితాలపై నాకేం నారాజ్ లేదని, యూపీ… ఫలితాలు వేరు… బెంగాల్ ఎన్నికలు వేరని ఆయన అన్నారు. యూపీ సీఎం మాట కారి.. మంచి జోష్ లో ఉన్నారని, ఎన్నికలు అనేవి గేమ్.. ఆడుతం.. ఓడుతం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జోష్ లో ఉన్నారని, యూపీ రిజల్ట్ ఇక్కడ ప్రభావం ఉండదని అసదుద్దీన్ అన్నారు. పదవుల గురించి చర్చ లేదని ఆయన స్పష్టం చేశారు.