బీజేపీ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకుంటోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనీ.. అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పథకం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరేలా ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. లేకుంటే ప్రతి పక్షాలు చేసే అబద్దాలే నిజమని నమ్మే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు…
నీళ్లు, నిధులకెడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆమె అన్నారు. సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని…
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…
తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం, కావలసిన నిధులు మంజూరు చేయకపోవడంతో బహుళ మోడల్ రవాణా వ్యవస్థ (Multi Model Transport System) రెండవ దశ పనులు నిలిచి పోయాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పనులు త్వరిగతినా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. రెండవ దశలో రైళ్లు రాయగిరి (భువనగిరి జిల్లా) వరకు పొడిగించుటకుకేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసి, రాష్ట్ర ప్రభుత్వం…
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేశానని చెప్పడం పచ్చి అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రాణహిత – చేవెళ్ల క్లోజ్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలను ఆపేశారు. పాలమూరు రంగారెడ్డి అలైన్మెంట్ మార్చి .. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన అన్నారు. వికారాబాద్ ను ఔషధ…
మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గులేకుండా జనంలో తిరుగుతుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండు పై ఇనుప గుండ్లు పెడుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు…
ఎన్నో సంక్షేమ పథకాలతో, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ ఎంపీ బడుగు లింగయ్య అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీలు కేసీఆర్ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా దేశంలో కేసీఆర్ కు జనాదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణకు కేంద్రం మోసం చేస్తోందని, విభజన హామీలు నెరవేర్చమని కోరుతున్నా పట్టించు కోవటం లేదని ఆయన మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరయినవి కావని ఆయన…
సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి నిస్సహాయ ప్రకటన చేసినా అర్థం ఉందని, కానీ ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉంది కూడా నిస్సహాయంగా ఉన్నారని మంతి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రంది ఉక్కు…
తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50…
కేసీఆర్ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25…