తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో మోసం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్, తెలంగాణకి ప్రతి విషయంలోనూ ద్రోహం చెయ్యడమే బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతి రాష్ట్ర బీజేపీ నేతా, తెలంగాణకు వ్యతిరేకులేనని విమర్శించారు. స్టేట్ బీజేపీ లీడర్లకు దమ్ముంటే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదియ్యాలని సవాల్ విసిరారు కేటీఆర్. Read Also:…
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. ఏ చర్చకైనా మేం సిద్ధం అన్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో రైతు వేదిక ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చని పంటపొలాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు. దేశంలో ఒక్క రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ఉంది.. దేశంలో ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా ఉంటే మేము రాజీనామా చేస్తామని సవాల్…
ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తుకు వచ్చేవారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకు వస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ లాంటి నేత మరెవరూ లేరన్న ఆయన.. ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్ పార్టీ బీజేపీ అన్నారు. అతి చిన్న పార్టీగా ప్రస్ధానం మొదలు పెట్టి..…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నారాయణ పేట జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఉండటానికి ఢిల్లీ, జార్ఖండ్ వెళ్లారన్న ఆయన.. ప్లీజ్ నన్ను కలవండని బ్రతిమిలాడుకుంటున్నారు…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారు.. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంది.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్‌ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం…
నేడు సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రతీకారంతో రగలిపోతున్న వ్యక్తే ఆయన్ను అంతమొందించేందుకు, సుపారీ ముఠాతో కలసి పథక రచన చేసినట్టు బయటపడుతోంది. ఈ కేసు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు.. రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యులు సమావేశమైనట్లు,ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను.. హత్య చేయడమే మార్గమని అన్నదమ్ములు భావించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌గౌడ్‌పై కోర్టు…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నివాసంపై దుండగులు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కథ స్క్రీన్ ప్లే అంత సీఎం ఆఫీస్ నుండే జరిగిందన్నారు. సినిమా రిలీజ్ కాకా ముందే కథ అడ్డం తిరిగింది. కొందరు ఐపీఎస్ అధికారుల తీరు ను చూసి కింది స్థాయి పోలీసులు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం కి కొమ్ముకాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, నిన్న జరిగిన ఘటనకు…
మా నాయకుల పరువు తీసే ప్రయత్నం చేశారు.. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసులు, పత్తాల కేసులు, రేప్ కేసులు, కబ్జా కేసులు అన్నింటిలో టీఆర్ఎస్ నేతలే ఉన్నారని ఆయన విమర్శించారు. పోలీసులు ఢిల్లీలో ఇంటి పై ఎలా దాడి చేస్తారని, బరి తెగించి ఉన్నామని సమాజానికి చెపుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, కేసు పెట్టిన జితేందర్…
రాష్ట్రంలో రక్షణ కరువయిందని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నాప్ లు, హత్యలు మామూలు అయిపోయాయని, ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ధరణి పోర్టల్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె అన్నారు. వేల మంది రైతులు నా దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుంన్నారని, ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని…