BJP MLA Rajasingh Fired on TRS Government.
2018 ఎన్నికలు ఏ విధంగా జరిగాయో తెలంగాణ ప్రజలకు తెలుసు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డబ్బు, మద్యం తో బీజేపీ అభ్యర్ధులను గెలవకుండా చేశారని, నేను ఒక్కడినే గెలిచానన్నారు. తెలంగాణ నుండి మొత్తం బీజేపీని ఖతం చేయాలని ముఖ్యమంత్రి కుట్ర చేశారని, టీఆర్‌ఎస్ నుండి నా పై ఫేక్ పిటిషన్ వేశారన్నారు. నా పై ఎన్ని కేసులు పెట్టారని డీజీపీ, కమిషనర్ కి లెటర్ పెట్టానని, తెలంగాణలో నాపై దాదాపు 48 కేసులు లీగల్ టీం గుర్తించిందన్నారు. ఆయన ఇంకా 4 కేసులు చూపేట్టలేదని పిటిషన్ వేసి నాపై కేసులు పెట్టారని, ఈ 4 కేసులకు నాకు సంబంధం లేదన్నారు. 3 సంవత్సరాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు..రాజా సింగ్ పొలిటికల్ కెరీర్ ఖతం అవుతుందని ఇబ్బంది పెట్టారన్నారు. రోజు హైకోర్టులో మాకు అనుకూలంగా కేసు వచ్చిందన్నారు. మా లీగల్ టీం కి ధన్యవాదాలు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించి నాకు సంబంధం లేని కేసులు ఇంకా 17 ఉన్నాయి..ఎవరో కొట్టుకున్న అందులో నన్ను A1 గా పెట్టారు అని ఆయన వెల్లడించారు.