తెలంగాణలో వేసవి తాపం పెరుగుతోంది. దాంతో పాటే రాష్ట్రంలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్టిపి వంటి అన్ని విపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా పాదయాత్రలు, బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఐతే, గత రెండు మూడేళ్లుగా తెలంగాణలో బీజేపీ తన ఉనికిని గట్టిగా…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి పీకే పర్యటించారు.. అయితే, ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అయితే, మీ (టీఆర్ఎస్ పార్టీ) ఓటమిని ఎవరూ ఆపలేరని పీకేనే చెప్పాడట అని వ్యాఖ్యానించారు. ఇక, రైతులతో చెలగాటం ఆటలాడితే మాడి…
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు…
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలో వడ్ల సమస్య లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందన్నారు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, రైతులను మోసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన…
సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల వరి కొనుగోలు నిరసన కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేకుండా వుండే కానీ 2014లో తెలంగాణ రాష్టం వచ్చాక ఈ రాష్టానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలు మాగాణి చేయడానికి గోదావరీ జలాలను ముఖ్యమంత్రి తెచ్చారని,…
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ మాట్లాడుతూ.. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందని ఆయన మండిపడ్డారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామన్నారు. తెలంగాణలో ప్రజలు భారతీయులు కాదా? తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా? మేమేమన్నా విదేశీయులమా? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనాలని అడగడం మా హక్కు. మీ మెడలు వంచైనా ధాన్యం కొనెలా ఒత్తిడి…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందని, కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు రైతాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లకి…
తెలంగాణ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని.. తన విషయంలో ఏం జరుగుతోందో మీడియాకు, ప్రజలకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను గౌరవించకున్నా.. కనీసం రాజ్‌భవన్‌ను గౌరవించాల్సి బాధత్య ఉందని ఆమె అన్నారు. అంతేకాకుండా సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు. గతంలో బీజేపీకి చెందినా ఇప్పుడు గవర్నర్ స్థాయిలో ఉన్నానని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ తో మాకు పంచాయితీ ఏమి…
దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమంతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అలా చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని కవిత పేర్కొన్నారు. ధాన్యం…
తెలంగాణ టీఆర్ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గతంలో ఉద్యమంలా ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రైతుల పోరాటం న్యాయమైన పోరాటమని, ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అని ఆయన జోస్యం చెప్పారు.…