ఒకప్పుడు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తెలంగాణ ఉద్యమంలో వారిద్దరీ ఒకటే మాట. ఒకటే బాట. కానీ తరవాత వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆశించిన తెలంగాణ రాలేదని ఆచార్య కోదండరాం బయటకు వచ్చారు. కోదండరాం బాటే ఇప్పుడు వేరయింది. తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ జనసమితిని వేరే పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు అందరినీ కలిసేలా చేశారు. ఇప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా అన్ని శక్తుల్ని ఏకం చేసే…
తెలంగాణలోని ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. యాసంగిలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతల హామీలతో కొంతమంది వరి వేశారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరుతడి పంటలు వేసుకున్నారు. తీరా ఇప్పుడు యాసంగి పంట చేతికివచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు విషయం చినికి చినికి గాలివానలా మారింది. యాసంగిలో పండించిన పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకంగా రాష్ట్ర…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష్య కట్టిందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి అన్ని రకాలుగా తీసుకు వెళ్లామని ఆయన అన్నారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అభివృద్ధిలో అడ్డంకులు, రైతుల ధాన్యం కొనడానికి అడ్డంకులు.. అన్నింటికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన తెలిపారని…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భారీగా కాంగ్రెస్ శ్రేణుల తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆయన ఆరోపించారు. రైతు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని, యాదాద్రి ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఆలయ ఉద్ఘాటనకు పిలవలేదని, మౌలిక సదుపాయాలు లేకున్నా ఆలయాన్ని…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆడుకుంటున్నాయని, ఏపీ, కర్ణాటకలో లేని సమస్య తెలంగాణలోని ఎందుకు ఉందని ఆయన మండిపడ్డారు. నేనే ధాన్యం కొంటా అన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఏమి చేయడం లేదని, రూ.1900 మద్దతు ధర దక్కాల్సిన రైతులకు 1300 దక్కుతుందన్నారు. మిల్లర్ లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని, తెలంగాణలో ధాన్యం…
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని…
విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సబ్సిడీ ఇచ్చినా వాడుకోలేకపోయారని దుయ్యబట్టారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పోలవరం గురించి మాట్లాడే నైతిక…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు..…
తెలంగాణ సర్కార్-రాజ్‌భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్లో టీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు..…