తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు తెలంగాణ మంత్రులు వినతి పత్రం అందజేశారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.. సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నవారు.. ఇలా అందరినీ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైనట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన…
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనదేశంలో పూర్వ కాలం నుంచి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని, ఎంతో మంది పోరాడితే మనం స్వేచ్ఛగా ఉన్నామని, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వర్గం వల్లకాదు ఎందరో పోరాడితే మనకు స్వాతంత్రం వచ్చిందని ఆయన…
హనుమకొండ జిల్లాలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో మా మహిళ మంత్రి కనబడ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. మా జిల్లా మంత్రులు కనిపించలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికల్లో మా మంత్రుల పేర్లు ఎందుకు పెట్టలేదని, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని…
మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు.. ప్రజల మనుసుల్లో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు.. నిన్న కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే హోదాలో పర్యటిస్తే.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డ ఆయన.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు నాపై భౌతికదాడులు చేసేందుకు యత్నించారని.. అదనపు…
సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, రఘునందన్ రావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీకి ఫోన్ చేసిన ఆయన.. కొందరు…
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. నేడు భారత్కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజువారి పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.. అయితే, ఎన్నికలు ముగియడం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. మళ్లీ క్రమంగా పైకి కదులుతూ సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి పెట్రో ధరలు.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. పెట్రో ధరల పెంపుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. పెట్రో ధరల పెంపు అనేది ప్రధాని నరేంద్ర…
Telangana CM K Chandra Shekar Rao Wrote Letter to Prime Minister Narendra Modi. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. ఇటీవల తెలంగాణలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇండియాకు ఎంతో మంది వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు. ఈ లేఖలో ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చిన వైద్య…