హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నేతల మధ్య కొనసాగుతోన్న వర్గపోరు బహిర్గతం అయ్యింది.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.. ఈ సందర్‌భంగా బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది.. గత కొద్ది కాలంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీజేపీలో కొనసాగుతున్న వర్గ పోరుకు వేదికగా మారింది హనుమాన్ శోభయాత్ర. నిజామాబాద్ ఎంపీ వచ్చిన తర్వాతే శోభాయాత్రను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనపాల్ సూర్యనారాయణ పట్టుబట్టగా… లేదు, షెడ్యూల్ ప్రకారం శోభాయాత్రను ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ పట్టుపట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఇతర నేతలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.. మొత్తంగా హనుమాన్ శోభాయాత్రలో వర్గపోరు బయటపడం హాట్ టాపిక్‌గా మారింది.
Read also: Khammam: బీజేపీ కార్యకర్త ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణం..!