సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు ఇచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా బాధ పడుతూ మాట్లాడారు..అసలు సినిమా ముందుంది అని 15 రోజుల కింద చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగులో విషయం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. సీఎం కేసీఆర్ దీనిపై నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరు ఘాటుగా స్పందిస్తూ మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఢిల్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగొడులో బీజేపీ గెలుపుకోసం అందరూ కృషి చేశారని అన్నారు.
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కే.ఏ.పాల్ మునుగోడు ఉపఎన్నికల్లో తన విజయం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.1.05 లక్షల మంది యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని పోలింగ్ ముగిసిన తర్వాత తెలిపారు.