మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. అయితే.. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అయితే.. టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలు కండకావరంతో అహంకారం తో మాట్లాడుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఇచ్చిన హామీల గురుంచి చెప్పకుండా గర్వంతో మాట్లాడుతున్నారని, ఒకటి గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారన్నారు. నీకు దమ్ముంటే 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామ చేయించు అని ఆయన సవాల్ విసిరారు.
Also Read : Fight in Wedding: వివాహ వేడుకలో తలెత్తిన గొడవ.. నలుగురు మృతి
ఎన్నికలకు మేము సిద్దం మీరు సిద్దమా అని ఆయన అన్నారు. బీజేపీలో ఎమ్మేల్యే చేరాలి అంటే రాజీనామా చేసి రావాలి అని ఆయన వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. అయితే.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్న బండి సంజయ్.. ఓడినా… గెలిచినా… నిరంతరం ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తామన్నారు. దాడులు జరిగినా… గుండాలకు భయపడకుండా రాజగోపాల్ రెడ్డి కష్టపడి ఎన్నికల ప్రచారంలో పనిచేశారన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశారని, లాఠీ ఛార్జ్ లు, బైండ్ ఓవర్ కేసులు, ఇలా ఎన్ని బెదిరింపులకు పాల్పడినా… కష్టపడి మా కార్యకర్తలు పనిచేశారు… వాళ్ళకి నా సెల్యూట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
మా నేతలు అందరూ సమన్వయంతో పనిచేశారని, విమర్శలు, ప్రతివిమర్శలకు ఇది సమయం కాదని, ఒక్క ఉప ఎన్నిక ఫలితం తోనే టీఆర్‌ఎస్ వాళ్ళు అహంకారంతో కుక్కల్లా మొరుగుతున్నారంటూ ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను 15 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు.. ఇచ్చిన సమయంలోపు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ నేతల అహంకారం చూసి, ఎందుకు టీఆర్‌ఎస్‌ను గెలిపించామా..? ఎందుకు తప్పు చేశామని మునుగోడు ప్రజలు భావిస్తున్నారన్నారు.