BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామనే విషయాలను మేనిఫేస్టోలో వివరించారు. 11 హామీలను ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు.
Read Also: By elections: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం.. 4 స్థానాలు కైవసం చేసుకునే దిశగా..
యూనిఫాం సివిల్ కోడ్ తో పాటు వక్ఫ్ ఆస్తులపై న్యాయ కమిషన్ తో చట్ట ప్రకారం విచారణ జరిపి అక్రమాలను అరికడతాం అని జేపీ నడ్డా ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్రంలో వైద్యసదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు, ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసి ఏడాదికి రూ. 3000 అందిస్తామని.. దీంతో 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
Read Also: Munugode By Election Results: బీజేపీ, టీఆర్‌ఎస్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన సీఈవో వికాస్
రాష్ట్రంలో దశల వారీగా 8 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ‘శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు.. మతపరమైన ప్రదేశాలు, దేవాలయాల చుట్టూ మౌళిక సదుపాయాలను, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనికి రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తామని.. హిమ్ తీర్థ్ సర్క్యూట్ తో కనెక్ట్ చేస్తానమి నడ్డా తెలిపారు. రాష్ట్రంలో యాపిల్ ప్యాక్ చేసేందుకు ఉపయోగించే మెటీరియల్ పై విధించే 12 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.