Munugode Bypoll Results Live Updates: తెలంగాణలో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపితే.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగారు రాజగోపాల్‌రెడ్డి.. మరోవైపు.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో.. పాల్వాయి స్రవంతిని పోటీకి నిలిపించింది ఆ పార్టీ.. ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు అసలైన ఫలితాలను ప్రతిక్షణం అప్‌డేట్స్ మీకోసం అందిస్తోంది ఎన్టీవీ..
హైదరాబాద్: మునుగోడులో కౌంటింగ్ పూర్తయింది.. వీవీ ప్యాట్ల లెక్కింపు కూడా ర్యాండంగా నిర్వహిస్తారు. 500 మంది సిబ్బంది కౌంటింగ్ కి సాయం చేశారు.. ఎన్నికల ప్రక్రియకు సహకరించినవారికి ధన్యవాదాలు-వికాస్ రాజ్, సీఈవో
మునుగోడు ఫలితం: టీఆర్ఎస్ కి 97,006, బీజేపీకి 86,697, కాంగ్రెస్ 23,906 ఓట్లు .. టీఆర్ఎస్ మెజారిటీ 10,309
హైదరాబాద్: మునుగోడులో అభివృద్ధికి, అహంకారానికి మధ్య జరిగినపోరులో విజయం సాధించాం. రాజకీయాల్లో హత్యలు వుండవు... ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కృషిచేసిన వామపక్ష నేతలకు ధన్యవాదాలు-మంత్రి కేటీఆర్
మునుగోడులో ముగిసిన కౌంటింగ్.. 10,006 ఓట్ల తేడాతో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్.తనదే నైతిక విజయం అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి రాజగోపాల్ రెడ్డిది కాదు , ప్రధానమంత్రి మోడీజీదే... ఈ ఎన్నికలో సీపీఐ. సీపీఎం విధానం సరైనదని నిరూపించబడింది. వామపక్షాలు బలపరిచిన TRS అభ్యర్థిని గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు అభినందనలు- ట్విట్టర్లో సీపీఐ నారాయణ
మునుగోడు ఫలితం: మునుగోడులో 11,666 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఘన విజయం
మునుగోడు ఫలితం: మునుగోడులో 11,666 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మూడోస్థానానికే పరిమతం అయింది కాంగ్రెస్.
మునుగోడు ఫలితం: ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్.. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం.. టీఆర్ఎస్ కి 95,028 ఓట్లు, బీజేపీకి 85,128 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 23,601 ఓట్లు మాత్రమే సాధించింది.
మునుగోడు ఎన్నికల ఫలితం: ముగిసిన 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు... 10 వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం.. 14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ కి 10,094 ఓట్ల ఆధిక్యం
మునుగోడు ఎన్నికల ఫలితం:హోరాహోరీగా సాగిన కౌంటింగ్.. కొనసాగుతున్న 14వ రౌండ్ కౌంటింగ్... కౌంటింగ్ సెంటర్ కి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు లో కారు హవా.. మాస్ స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి..
మునుగోడు ఎన్నికల ఫలితం: 13 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ కు 88,416, బీజేపీకి 79,571, కాంగ్రెస్ కు 22,424 ఓట్లు
మునుగోడు ఎన్నికల ఫలితం:ప్రతిరౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం.. హోరాహోరీగా సాగిన కౌంటింగ్.. కొనసాగుతున్న 14వ రౌండ్ కౌంటింగ్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇవాళ ధర్మమే గెలిచిందన్నారు జగదీష్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఓటేసి టీఆర్ఎస్ ను గెలిపించారు. 13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనిపించిందన్నారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభం అయిందన్నారు.
మునుగోడు ఎన్నికల ఫలితం: 13వ రౌండ్లో టీఆర్ఎస్ కి ఆధిక్యం.. 9039 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్...
మునుగోడు ఎన్నికల ఫలితం: 13వ రౌండ్లో టీఆర్ఎస్ కి ఆధిక్యం.. తెలంగాణ అంతటా టీఆర్ఎస్ నేతల సంబురాలు.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
మునుగోడు ఎన్నికల ఫలితం: కేసీఆర్ అవినీతి సొమ్ముకు మునుగోడులో వామపక్ష నేతలు అమ్ముడుపోయారు..టీఆర్ఎస్ కు కమ్యూనిస్టు పార్టీల ఓట్లు కలిసి వచ్చాయి-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎన్నికల ఫలితం: 12 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ కు 81,825, బీజేపీకి 74.225, కాంగ్రెస్ కు 21,218 ఓట్లు పోలయ్యాయి.
మునుగోడు ఎన్నికల ఫలితం: 12వ రౌండ్లో ముగిసిన కౌంటింగ్.. 12వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం.. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 7794 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్....
మునుగోడు ఎన్నికల ఫలితం: కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి. ప్రజల తీర్పుని గౌరవిస్తున్నానన్న రాజగోపాల్ రెడ్డి.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు.. ప్రభుత్వ యంత్రాంగం అంతా అష్టదిగ్బంధం చేసింది.... డబ్బులు, మద్యం ఏరులై పారింది.
హైదరాబాద్: కేసీఆర్ వెంటే తెలంగాణ అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్.. సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్
మునుగోడు ఎన్నికల ఫలితం: 11 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ కు 74,377, బీజేపీకి 68,771, కాంగ్రెస్ కు 19,390 ఓట్లు
మునుగోడు ఎన్నికల ఫలితం:కొనసాగుతున్న 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు.. 11రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షా 70వేల ఓట్ల కౌంటింగ్ పూర్తి.
మునుగోడు ఉప ఎన్నికలో ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉండడంతో వేలాదిగా తరలివచ్చారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు నినాదాల హోరెత్తిస్తున్నారు. డప్పు మోతలతో తెలంగాణ భవన్ ప్రాంతం గులాబీ మయం అయింది.
హైదరాబాద్; మునుగోడు ఉప ఎన్నికలో ఆధిక్యంలో టీఆర్ఎస్.. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు..బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాల హోరు..
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం: 10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం.. 10 రౌండ్లు పూర్తయ్యే సరికి 4539 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.. క్రమంగా టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూ పోతోంది.. 9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం లభించింది.. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి 3,925 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కూసుకుంట్ల..
రౌండ్ రౌండ్‌కి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యం పెరుగుతోంది.. ఇప్పటికే 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా.. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్ 536గా ఉంది.. ఇక, ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఆధిక్యం మూడు వేలు దాటి 3,285కి చేరింది.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది.. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 386 ఓట్ల ఆధిక్యం వచ్చింది.. ఇక, ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తైన తర్వాత టీఆర్ఎస్‌కు మొత్తం 2,555 ఓట్ల ఆధిక్యం దక్కింది.
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసిన అడిషనల్ ఎస్పీ పై వేటు.. గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌పై వేటు వేసి రాష్ట్ర ఎన్నికల సంఘం..
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. ఆరో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం దక్కింది.. ఆరో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 2,162 ఓట్ల ఆధిక్యం దక్కింది.
4- 5 రౌండ్లు మధ్య 20 నిమిషాల ఆలస్యం జరిగింది.. అందరి సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతుంది.. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో లేట్ అవుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. పొలిటికల్ ప్రతినిధులు, అబ్జర్వ్ ర్లు, ఆర్ఓ అందరూ ఒకే అన్న తర్వాత ఫలితాల వెల్లడిస్తున్నామన్న ఆయన.. చాలా పారదర్శకంగా కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు..
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ఐదో రౌండ్‌లో ఫలితాలను విడుదల చేసింది ఈసీ.. టీఆర్ఎస్ 6162, బీజేపీ 5245.. టీఆర్ఎస్ లీడ్ 917, ఐదు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 32,405, బీజేపీ 30,975, కాంగ్రెస్ 10,055, బీఎస్పీ 1,237.. టీఆర్‌ఎస్ ఆధిక్యం 1430 ఓట్లు
చౌటుప్పల్ ప్రాంత ఓట్ల లెక్కింపు తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తిరిగి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు.. అయితే.. నాల్గో రౌండ్ రీకౌంటింగ్ చేయాలని కోరే యోచనలో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్.. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడంలేదన్నారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించని సీఈవో.. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ మండలంలో మేం అనుకున్న మెజార్టీ రాలేదన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. నాల్గోరౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన.. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి.. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు అన్నారు.. ఇక, బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందన్నారు కోమటిరెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. ఒక్కో రౌండ్‌లో ఒక్కో విధంగా ఓట్లు వస్తున్నాయి.. అయితే, కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠ పంచుతున్నాయి.. నాల్గో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.. టీఆర్ఎస్ 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్పీ 907 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 613 ఓట్ల ఆధిక్యం లభించింది.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం లింగవానిగూడెంలో బీజేపీ అభ్యర్థికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఆధిక్యం దక్కింది..
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠరేపుతున్నాయి.. నాల్గో రౌండ్‌లో బీజేపీకి భారీ ఆధిక్యం లభించింది.. నాల్గో రౌండ్ ముగిసే సరికి.. 2000లకు పైగా ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ కు మొదటి రౌండ్ లో 104, గాలయ్య చెప్పుల గుర్తు 157 ఓట్లు, కేఏ పాల్ ఉంగరం గుర్తు 34 ఓట్లు, రోడ్ రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ హవ కొనసాగుతోంది.. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. వరుసగా, రెండు, మూడు నాలుగో రౌండ్ ల్లలో బీజేపీకి ఆధిక్యం కొనసాగుతోంది
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠగా సాగుతున్నాయి.. మూడో రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం లభించింది
4వ రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలో వుంది. నాల్గవ రౌండ్ లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కంటే బీజేపీ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో టీఆరెస్‌ఎస్, 2,3,4 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నారాయణ్ పూర్ మండల కౌంటింగ్ మొదలైంది. ఐదోరౌండ్ లో ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో రెండో రౌండ్‌లో 789 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.. అయితే, తొలి, రెండో రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీకి 515 ఓట్ల ఆధిక్యం లభించింది..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పరిశీలించారు.. హైదరాబాద్ ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ తో పర్యవేక్షణ చేశారు.. కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ జరుగుతున్న తీరును ఆబ్జర్వ్ చేశారు వికాస్ రాజ్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు అధిక్యం రాగా.. రెండో రౌండ్‌లో బీజేపీకి 789 ఓట్లకు పైగా ఆధిక్యం లభించింది..