మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ నెల 3న మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు.
Also Read : South Africa: దురదృష్టం అంటే ఇదే.. ఖాయం అనుకున్న సెమీస్ బెర్త్ చేజారింది
అయితే.. ఇంకా 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉండగానే దాదాపు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే.. దీంతో.. కౌంటింగ్ కేంద్రం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానన్నారు.
Also Read : Rajagopal Reddy Reaction Live: ఒక్కడిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు
ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తిని ఓడించేందుకు వందమంది ఎమ్మెల్యేలు వచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో నైతిక గెలుపు మాదే అన్న రాజగోపాల్ రెడ్డి.. వాళ్లు వందమంది ఎమ్మె్ల్యేలను పంపినప్పుడే నేను గెలిచానన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 3వ తేదీ సాయంత్రం వరకు మునుగోడులోనే ఉన్నారన్నా్రు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అష్టదిగ్బంధం చేసిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించారన్నారు. టీఆర్‌ఎస్‌ది గెలుపు కాదని, ఇది నెంబర్‌గేమ్ మాత్రమేనన్నారు రాజగోపాల్ రెడ్డి. సంక్షేమ పథకాలు రద్దవుతాయని ఓటర్లను బెదరించారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ అవినీతి సొమ్ముకు మునుగోడులో వామపక్ష పార్టీల నేతలు అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్‌కు కమ్యూనిస్టు పార్టీల ఓట్లు కలిసి వచ్చాయన్నారు.