ఇప్పుడు మునుగోడు బై పోల్ పై దృష్టి పెట్టారు బెట్టింగ్ రాయుళ్లు.. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్లు కాస్తున్నారు..
Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Jharkhand Chief Minister H Soren Summoned Tomorrow In Mining Scam Case: అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగం పెంచింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు రావాల్సిందిగా కోరింది. రాంచీలోనీ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో రేపు విచారణకు జరగనుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ జూలైలో…
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ... అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.
రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని.. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది ఎన్నికల కమిషన్..
మీ ముఖాలకు 1st తారీఖు న జీతాలు అడిగారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. అన్ని కులాలను కేసీఆర్ వదిలేశాడని, కులాల వారిగా ఎవరికి ఏమి చేశావో చెప్పాలని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.