Munugode By Election Results: మునుగోడులో 50 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేఏ పాల్.. ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. కేఏ పాల్ ఉంగరం గుర్తుకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈవీఎంల పనితీరుపై తనకు నమ్మకం లేదన్న ఆయన ఇదంతా బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల కుట్రగా భావిస్తున్నానని చెప్పారు. మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. లక్ష ఓట్లు పడ్డాయి అది అందరికీ తెలుసు అది మీక్కూడా తెలుసు అంటూ ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. ఇది కేవలం అవినీతి ఎలక్షన్స్‌అని అన్నారు. ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని అన్నారు. వందల వేల కోట్లు పంచడం మీరే చూసారు కదా బీజేపీది 25 కోట్లు.. టీఆర్‌ఎస్ 3వేలకోట్లు పంపిణీ జరిగిందని ఆరోపించారు. 30, 20 కోట్లు మాత్రమే సీజ్ చేశారని అని అన్నారు. దీని అర్థం ఏంటి అని ప్రశ్నించారు కేఏ.పాల్.
Read also: Raghunandan Rao: కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు
ఓపెన్ గా మందు, ముక్క పంపిణీ చేసినప్పటికి ఇంత క్లియర్ గా అవినీతి జరుగుతున్నదని మీకు తెలుసుకదా అన్నారు. దీనిని రద్దు చేయాలని కోరుకుంటున్నానని డిమాండ్ చేశారు కేఏ పాల్. ఇక్కడ అంతా టీఆర్‌ఎస్ తొత్తులు వున్నారని ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను బయటికి పొమ్మన్నాడు నేనే అతన్ని పైకి పంపిస్తా అన్నాడు. మళ్లీ నాదగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తాడట ఇప్పుడేం చేస్తాడు ఆయన అంటూ ఫైర్ అయ్యారు. ముందు జగన్నాత్, ఇప్పుడు రోహిత్ సింగ్ వీళ్లంతా టీఆర్‌ఎస్ , బీజేపీ ఎజెంట్లు అంటూ మండిపడ్డారు. ఈరెండు పార్టీలు కుమ్మక్కై అవినీతి జరిగింది. ఇప్పుడు బీజేపీకి కొంచెం టీఆర్‌ఎస్ కు లీడ్ ఇచ్చి బీజేపీ ఈవీఎంలతో ట్యాంపర్ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. నాకు మినిమం 30 వేల నుంచి 40 వేల మెజారిటీ ఉంటుంది ప్రతి ఛానల్ లో నాకు 50 వేల మెజారిటీ వచ్చింది ఎందుకు అని అలాంటి యూత్, స్టూడెంట్, లక్షమంది ప్రజలు తన వైపు వున్నాయని ప్లీస్ డిసప్పాయింట్ అవకండని కేఏపాల్ తెలిపారు. కొద్ది నిమిషాల తరువాత మాట్లాడుతా.. క్లారిటీ రానివ్వండి అంటూ కే.ఏ.పాల్ వెళ్లిపోయారు. దీనిపై కే.ఏ.పాల్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కే.ఏ.పాల్ పై భారీగా బెట్టింగులు చేస్తూ క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొడతాడా! అంటూ కే.ఏ.పాల్ అంటూ సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తున్నారు.