Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
టీఆర్ఎస్ అభ్యర్థికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి మద్దతు ఇచ్చినట్లు కొంత మంది పోస్టులు పెట్టారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
By-elections in Munugode, Adampur, Andheri East and 4 other seats: తెలంగాణలో మునుగోడుతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలకు కీలకంగా మారాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ రోజు జరగుతున్నాయి.…