మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 97,006 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 86,697 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే.. కాంగ్రెస్ 23,906 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ గలంతైంది. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి 10,309 మెజారిటీతో గెలుపొందారు.
Also Read : KTR Press Meet Live: మునుగోడు విక్టరీపై కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్
అయితే.. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో 12కి 12 స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షా, మోడీ అహంకారానికి చెంపపెట్టులా మునుగోడు ప్రజలు తీర్చిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. 9 రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చారని ఆయన అన్నారు.
Also Read : Big Breaking: మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం
మునుగోడులో అభివృద్ధికి, అహంకారానికి మధ్య జరిగినపోరు అని, రాజకీయాల్లో హత్యలు ఉండవు… ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కృషిచేసిన వామపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. డబ్బుతో జనం గొంతు నొక్కాలని బీజేపీ చూసిందని, వందలకోట్లు దొరికాయని మేం ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ మౌనంగా లేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఈటల, రాజగోపాల్ రెడ్డితో ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని, ఓటమిని అంగీకరించే దమ్ముండాలన్నారు మంత్ర కేటీఆర్. బీజేపీ నేతలు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత ఎన్నికతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు 9శాతం ఓట్లు పెరిగాయని, కారును పోలిన గుర్తులకు దాదాపు 6 వేల ఓట్లు పడ్డాయన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.