కేంద్రం చొరవతో అట్టడుగు స్థాయి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొంటూ, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి, దేశ ప్రజలకు పోటీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడు వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ జరగలేదని మండిపడ్డారు.
Etala Rajender: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు.
KCR: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారన్నారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నిక కొలిక్కిరావడం లేదు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పైట్ తో మూడు సార్లు ఎన్నిక వాయిదా పడింది. దీంతో మరోసారి ఈ నెల 16 గురువారం రోజున మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఈ మేరకు ఫిబ్రవరి 16న మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఉదయం ఆమోదించినట్లు అధికారులు…